ఆశ్రమ పాఠశాలలో సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీ
ఆశ్రమ పాఠశాలలో సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీ
– భోజనం వండే ప్రదేశాన్ని, భోజనం వండుతున్న విధానాన్ని పరిశీలన
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ములుగు జిల్లా సీవిల్ సప్లయ్ అధికారి డీఏం రాంపతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన అశ్రమ ఉన్నత పాఠశాలలోని విధ్యార్దులకు వండుతున్న భోజనాన్ని, వండే విదానాన్ని పరిశీలించారు. అంతే కాకుండా నిత్యవసర సామాగ్రిని, కందిపప్పు, శనగ పప్పు, గోదుమరవ్వ వాడుతు న్న కూరగాయాలు ఏలా ఉన్నాయన క్షుణ్ణంగా పరిశీలించా రు. ఈ సందర్బంగా సీవిల్ సప్లయ్ డీఏం రాంపతి మాట్లా డుతూ ఇటీవల కాలంలో నారాయణపేట జిల్లా ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు జరిగిన పుడ్ పాయిజన్ నేపద్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు అదేశాలు చేసింది. ఆశ్రమ పాఠశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశానుసారం శనివారం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి(ఏహెచ్ఎస్) అశ్రమ ఉన్నత పాఠశాలలో ఆకస్మీకంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో గోదుమ రవ్వలో లక్క పురుగులు ఉండడం గుర్తించామని, అలాగే కంది పప్పు, శనగ పప్పు కొద్దిగా పాడయి ఉండడం గుర్తించామని, అటువంటి సామాగ్రిని వెనుకకు పంపించి కొత్త సామాగ్రిని తెచ్చుకోవాలని పాఠశాల సిబ్బందికి అదేశాలు చేశామన్నారు. అంతే కాకుండా విద్యార్దులకు వండే బియ్యం 5 సార్లు కడగాలని, వండే కూరగాయాలను, పప్పులను శుభ్రంగా కడిగిన తర్వాతే వాడాలని సూచించారు. అనం తరం పాఠశాలలోని మరుగుదోడ్లను పరిశీలించి, మరుగు దొడ్లను ఏప్పటికప్పుడు దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు,గ్రామ పంచా యతీ కార్యదర్శి పాల్గొన్నారు.