నర్సింగ్ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ 1 పురస్కరించుకొని శనివారం కాటారం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ వందన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాదేవపూర్ సమీకృత సలహా పరీక్ష కేంద్రం (ఐ సి టి సి) కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు. హెచ్ఐవి నిర్వచనం, వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమానాలు, అపోహలు, వివరణ, ఎయిడ్స్ మందులు, తప్పనిసరి గర్భిణీ స్త్రీల పరీక్షలు, రెడ్ రిబ్బన్ క్లబ్బుల ఏర్పాటు ఆవశ్యకత తదితర అంశాలపై కూలంకషంగా ముఖాముఖిగా ప్రశ్నోత్తరా ల రూపంలో అవగాహన కల్పించారు. సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరు లాగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు, యువత మేల్కొని సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐ సి టి సి కౌన్సిలర్ గాదె రమేష్ అన్నారు. ముందస్తుగా రక్త పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకోవడం ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని అన్నారు. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ జరిగితే ఏఆర్టి మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, వివేకానంద ఒకేషనల్ విద్యార్థులు పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వందన, ఐ సి టి సి కౌన్సిలర్ రమేష్ తో పాటు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఫిజియోథెరపిస్ట్ వెంకన్న, స్టాఫ్ నర్స్ అభినయ, వివేకానంద స్కూల్ డి ఎం ఎల్ టి ఇన్ స్ట్రక్టర్ రుచిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.