Kaleshwaram | మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత ప్రమాణాలపై సిబిసిఐడి విచారణ చేపట్టాలి

Kaleshwaram | మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత ప్రమాణాలపై సిబిసిఐడి విచారణ చేపట్టాలి

  •  ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్

 తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాలేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్ల విషయంపై సిబిసిఐడి విచారణ చేపట్టాలని ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన కాటారంలో కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన అనంతరం ఆయన కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో గల చాయకొట్టు వద్ద టీ తాగుతూ విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. కోట్లాది రూపాయల సొమ్ముతో చేపట్టిన ప్రాజెక్టు నాణ్యత నాసిరకంగా ఉందనడానికి కుంగిన పిల్లర్లు నిదర్శమని ఆయన విమర్శించారు. నిర్మాణాల నాణ్యత ప్రమాణాలపై సిబిసిఐడి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.