Si Raju | ప్రజలు దసరాను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్సై చల్ల రాజు
వెంకటాపూర్ ప్రతినిధి : మండల పరిధిలోని ప్రజలందరికీ ఎస్సై చల్ల రాజు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా ఎస్సై రాజు విలేకరులతో మాట్లాడుతూ దసరా పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ఇతరుల పట్ల, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకుద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.