ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు : కానిస్టేబుల్ మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు : కానిస్టేబుల్ మృతి

ములుగు, ఫిబ్రవరి 17, తెలంగాణ జ్యోతి : ములుగులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదుట శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసు కానిస్టేబుల్ పొదెం కోటేశ్వర్రావు (40) మృతిచెందాడు. ములుగు ఎస్పీ కార్యాలయంలో ఇంటలీజెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న కోటేశ్వర్రావు డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఆస్పత్రి ఎదుట సిగ్నల్ వద్ద యూట తీసుకునే క్రమంలో హనుమకొండ నుంచి మేడారం వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో కోటేశ్వర్రావు తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడున్న వారు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స చేస్తుండగానే కోటేశ్వర్రావు ప్రాణాలు విడిచాడు. వాజేడు మండలం పెదగొల్లగూడెం గ్రామానికి చెందిన కోటేశ్వ రరావు 2009 బ్యాచ్లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు. కాగా, ఆయనకు భార్య సౌజన్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.