ములుగు జిల్లాలో ఇసుక లోడింగ్ నిలిపివేత
ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా లోని వివిధ ఇసుక క్వారీలను తాత్కాలికంగా మూసి వేస్తున్న ట్లు టీఎస్ఎండీసీ అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి మేడారం జాతర సందర్భంగా ఇసుక క్వారీలను ఈనెల 18 నుంచి 24 వరకు ఇసుక లారీలలో లోడింగ్, ఆన్లైన్లో ఇసుక సమాచారం, బుకింగ్ లు నిలిచి పోతాయని పేర్కొన్నారు. ఇట్టి సమాచారాన్ని లారీ డ్రైవర్లు, ఓనర్లు గమనించాలని కోరారు. జాతర అనంతరం ఇసుక లోడింగ్ యధావిధిగా కొనసాగుతుందని అన్నారు.