ప్లేస్ మెంట్ సాధించిన బిట్స్ స్కూల్ విద్యార్థి
ప్లేస్ మెంట్ సాధించిన బిట్స్ స్కూల్ విద్యార్థి
ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు చెందిన విద్యార్థి రెహాన్ పాషా సైనిక్ స్కూల్ లో 2024 -25 సంవత్సరానికి గాను ప్రవేశానికి సీటు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయు డు కే రజనీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె. రజనీకాంత్ మాట్లాడుతూ మహమ్మద్ రెహాన్ పాషా/ తండ్రి గౌస్ పాషా సైనిక్ స్కూల్ లో ప్రవేశానికి సీటు సాధించినందు కు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రెహాన్ పాషా సైనిక్ స్కూల్ ప్లేస్ మెంట్ సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యా యులు రంజిత్ రెడ్డి, రాకేష్ శర్మ, స్వాతి లకు బిట్స్ స్కూల్ యాజమాన్యం డా ఏ రాజేంద్ర ప్రసాద్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థీ రేహాన్ పాషా కు మేనే జ్మెంట్ వారి అభినందనలు తెలియజేస్తూ రెహాన్ పాషా విద్య లో ఇంకా ఉన్నత స్థానాలను అధిగమించాలని కోరుకుంటు న్నామని తెలిపారు.