కుమారుని పుట్టిన రోజున పుట్టిన ఊరికి మహత్కార్యం 

కుమారుని పుట్టిన రోజున పుట్టిన ఊరికి మహత్కార్యం 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం సబ్ డివి జన్ పరిధిలో స్వయంకృషి సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్ర మాలను స్ఫూర్తిగా తీసుకొని మల్హర్ మండలం రుద్రా రం గ్రామ వాస్తవ్యులు మందోట సాయి శిరీష – తిరుపతి పటేల్ ప్రథమ పుత్రుడు సుహాన్ పటేల్ పుట్టినరోజు సంద ర్భంగా స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ కాటారం ఆధ్వర్యంలో రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు అంగన్వాడి కేంద్రాలలో కుర్చీలు, పలకలు, స్వీట్లు, ఆట వస్తువులు, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేషారు. ఈ సందర్భంగా స్వయం కృషి సేవా సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ తమ బర్త్ డే లాంటి ఇతర శుభ కార్యా లకు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ మీ పరిసరా లలో వున్నా వృద్దులకు, పేద విద్యార్థులకు, నిరాశ్రయులకు మీవంతుగా తోచిన సహాయం చేయగలరని కోరారు.ఈకార్య క్రమంలో గ్రామ పెద్దలు, స్వయంకృషి సభ్యులు పాల్గొన్నారు.