ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి  

Written by telangana jyothi

Published on:

ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి  

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండ లం ఊరట్టం కాలనీ (కొత్తూరు) గ్రామానికి చెందిన కుర్రి రత్నకుమారి (45) ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెంది న సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం… కుర్రి రత్నకుమారి (అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్) గత నాలుగు రోజుల నుండి జ్వరం వచ్చిందని నార్లాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రాజ్ కుమార్ వద్దకు వెళ్లి వైద్యం పొందారు. ఆదివారం సాయంత్రం జ్వరం ఎక్కువ కావడంతో మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లాగా,  పరీక్షలు నిర్వహించి డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పాడు. ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టి అందులో రెండు ఇంజ క్షన్లు వేశాడు. అది అయి పోయిన అనంతరం మళ్లీ ఒక బాటిల్ పెట్టి మళ్లీ రెండు ఇంజక్షన్లు కలిపాడు. దీంతో రత్న కుమారి పరిస్థితి విషమంగా మారింది. రత్నకుమారి పరిస్థితి గమనించి, వెంటనే ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలిం చారు. అక్కడి వైద్యులు సెలైన్ బాటిల్ లో ఏ ఇంజక్షన్లు వేసి, ఏం వైద్యం చేశాడో తెలుసుకోవడానికి ఆ ఆర్ఎంపీ కి ములుగు ఏరియా హాస్పిటల్ వైద్యులు ఫోన్ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఫోన్ కలవకుండా పెట్టుకున్నాడు. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరు గైన వైద్యం గురించి ఎంజిఎంకు 108 ద్వారా తరలించారు. తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే రత్నకుమారి మృతి చెందారు. రత్న కుమారికి ఒక కొడుకు భాస్కర్, ఒక కూతురు ఉన్నారు. కాగా రత్నకుమారి భర్త సుమారు గత పది సంవత్స రాల క్రితమే మృతి చెందాడు. ఆమె కష్టం చేసుకుంటూ కూతురు పెళ్లి చేసింది. ఇప్పుడు కొడుకు అనాధగా మారాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now