ఆదివాసీల పోరాట యోధుడు బిర్సాముండా

ఆదివాసీల పోరాట యోధుడు బిర్సాముండా

ఆదివాసీల పోరాట యోధుడు బిర్సాముండా

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఆదివాసీ హక్కుల మొదటి పోరాట యోధుడు బిర్సా ముండా అని బాలికల రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రావణి అన్నారు. శుక్రవారం వెంకటాపురం మండలం కేంద్రంలోని కళాశాలలో బిర్సాముండా 150వ జయంతి సందర్శభంగా నెహ్రు యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా జయంతిని జన్ జాతీయ గౌరవ్ దివస్ గా కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా నిర్వహిస్తోందని ప్రిన్సిపల్ శ్రావణి తెలిపారు. విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకమని, ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కిషోర్ కుమార్, కళాశాల అధ్యాపకులు, యువజన సంఘం నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.