శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో భువనేశ్వరి పీఠాధిపతులు

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో భువనేశ్వరి పీఠాధిపతులు

కాళేశ్వరం, తెలంగాణజ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో గన్న వరం భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు. వారిని ప్రధాన రాజగోపురం ముందు నుండి అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పీఠాధిపతులు స్వామివారికి అభిషేకం చేసి అనంతరం అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అనంత రం పార్వతి అమ్మవారి ఆలయంలో పీఠాధిపతులు భక్తు లకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆల య సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కాలేశ్వరం గ్రామస్తు లు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.