గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి బాలుడి ప్రాణం బలి..?
– పదవతరగతి బాలుడు జ్వరంతో మృతి
ములుగు ప్రతినిధి : వార్డెన్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది.. వారం రోజులుగా జ్వరం వచ్చినా ఒక్కరోజు మందులు ఇచ్చి పట్టించు కోకపోవడంతో తమ కుమారుడు మృతిచెందాడని విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో జరిగింది. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన కోరం చరణ్ (15) గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వతరగతి చదువుతు న్నాడు. నిరుపేదలైన తల్లిదం డ్రులు కోరం శ్రీలత బాబులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి చరణ్ తోపాటు ఐదేళ్ల మరో బాబు ఉన్నాడు. చదువుల్లో ముందువరుసలో ఉండే చరణ్ గురుకుల పాఠశాలలో 10వతరగతి చదువుతు న్నాడు. అయితే పాఠశాల నుంచి చరణ్ కు జ్వరం వచ్చిందని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఫోన్ రావడంతో గురువారం వ్యక్తిగత పని మీద ములుగుకు వచ్చిన బంధువుకు విషయం చెప్పిన తండ్రి బాబు చరణ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. సదరు మహిళ వెంటనే గురుకులం నుంచి చరణ్ ను తీసుకువచ్చి ములుగు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లిందని, బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తాను సైతం ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పాడు. ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు చరణ్ కు మూత్రం బంద్ అయ్యిందని, వరంగల్ కు రిఫర్ చేయడంతో ఎంజీఎంకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బాలుడు మృతి చెందా రు. తన కొడుకు అనారోగ్యం పట్ల అడిగి తెలుసుకు న్నానని, వారం రోజుల నుంచి జ్వరం వస్తుండగా మూడు రోజుల నుంచి మూత్రం బంద్ అయ్యిందని చెప్పినట్లు తండ్రి బాబు వివరించారు. తన కొడుకుకు సకాలంలో వైద్యం చేయించి ఉంటే బతికి ఉండేవాడని రోదించారు. కాగా, మృతిచెందిన బాలుడు చరణ్ అంత్యక్రియలను సైతం కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట గ్రామ స్థులు చందాలు పోగుచేసుకొని నిర్వహించినట్లు సమా చారం. తన కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.
– గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి : ఏఎస్యూ డిమాండ్
ములుగు మండలం ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్, సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థి చరణ్ మృతిచెందాడని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బకట్ల శ్రీకాంత్ ఒక ప్రకట నలో డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా జ్వరం వస్తున్నా పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడం దారుణమన్నా రు. విద్యార్థికి మూత్రం బంద్ అయ్యేవరకు ఏం చేశారని ప్రశ్నించారు. గిరిజన గురుకులాల్లో విద్యార్థుల సమస్యల పై నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహి స్తున్నారని ఆరోపించారు. విద్యార్థి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవమరించిన వార్డెన్, ప్రిన్సిపల్, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, బాలుడి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.