భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విస్తృత పర్యటన.
భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విస్తృత పర్యటన.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీ నేతల తో జరగబోయే ఎన్నికలలో పార్టీ విజయవకాశాలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, కారు గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి, గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక, ముత్తారం మరియు ఇతర గ్రామాలతో పాటు వెంకటాపురం మండల కేంద్రంలో పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరియు గ్రామ పెద్దలు ఇతరుల గృహాలకు వెళ్లి ఆత్మీయ పలకరింపులతో, కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని డాక్టర్ తెల్లం వెంకటరావు పార్టీ నేతలతో కలిసి వెళ్లి అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రం లో బిఆర్ఎస్ నేత బాలసాని వేణు స్వగ్రుహంలో బిఆర్ఎస్ నేతలు ,ప్రజాప్రతినిధులు, నేతలు ,కార్యకర్తలతో మంతనాలు జరిపారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు గంపా రాంబాబు ,పి.మురళి , సీనియర్ నాయకులు బాలసాని వేణు, పార్టీ ప్రజాప్రతినిధులు, మండల జడ్పిటిసిపి. రమణ, పార్టీనేత డర్రా దామోదర్, క్యాడర్, అనుబంధ సంఘాల నాయకులు పార్టీ అధికార ప్రతినిధి దామోదర్ ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు తో పార్టీ అభ్యర్థి డాక్టర్ వెంకటరావు మాట్లాడారు. ఆత్మీయ పలకరింపులతో పార్టీ విజయవకాశాలపై మద్దతు కావాలని కోరారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖుల ఇళ్ళకు వెళ్లి తమను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మంగళవారం సాయంత్రం పొద్దుపోయే సమయంలో వాజేడు మండలంలో డాక్టర్ వెంకటరావు పర్యటించి ముఖ్య నేతలు కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి అదర్ని సమన్వయంతో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని, భద్రాచలం నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సైనికుడిగా పని చేయాలని ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ను, ప్రజాప్రతినిధులను పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈసంథర్భంగా రెండు మండలాల్లో వందలాదిమంది వివిద పార్టిలకు చెంధనవారు డాక్టర్ సమక్షంతో బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు నేతలు ప్రకటించారు.