కాళేశ్వరం డోలు కళాకారునికి బంగారునంది అవార్డు
కాళేశ్వరం డోలు కళాకారునికి బంగారునంది అవార్డు
– హైదరాబాద్ లో స్వీకరించిన చిలుమల మహేష్
కాలేశ్వరం, తెలంగాణ జ్యోతి : ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానంలో డోలు, సన్నాయి వాయిద్యునిగా పని చేస్తున్న చిలుముల మహేష్ కు జాతీయ స్థాయి బంగారు నంది అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును మహేష్ స్వీకరించారు. కాళేశ్వర ముక్తిశ్వర స్వామి దేవస్థానంలో డోలు వాయిద్యు నిగా పనిచేస్తున్న చిలుముల మహేష్ కు కళారంగంలో అందిస్తున్న సేవలకు గాను విశ్వవిఖ్యాత ఆర్ట్స్ కల్చర్ అకా డమీ, శ్రీ గౌతమేశ్వర గో సంరక్షణ సమితి సంయుక్తంగా నంది అవార్డు ప్రకటించాయి. ఆదివారం (ఈనెల 28న) హైదరాబా ద్ లోని త్యాగరాజ గాన సభ ఆడిటోరియంలో జరిగిన కార్యక్ర మంలో పాల్గొని ప్రతిభ చాటినందుకుగాను శ్రీ గౌతమేశ్వర గో సంరక్షణ సమితి చైర్మన్ ఆకుల విద్యాసాగర్ గురజీ, ఎస్వీర్ డిజిటల్ చైర్మన్ డాక్టర్ ఎస్వీ ఆర్ వెంకటేష్ అవధానులు, ప్రముఖ నృత్యకళాకారిణి, ఉజ్వల మహిళా ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చీమల కోటీశ్వరి, సినీ పరిశ్రమ హంస గోల్డ్ మ్యాన్ దుర్గం చిన్నయ్య, కవిరయిత భాస్కర శర్మ చేతుల మీదుగా బంగారు నంది అవార్డును మహేష్ స్వీకరించారు. కాగా, జాతీయ అవార్డు స్వీకరించినందుకు గాను ఆలయ కమిటీ, గ్రామస్థులు మహేష్కు అభినందనలు తెలిపారు.