అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినికి ఆర్థిక సహాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం నాగారం గ్రామ ఆదివాసి ఆణి ముత్యం, గుజరాత్ రాష్ట్రం గాంధీ నగరం లో ఐ.ఐ.టి సీటు సాధించిన ఆదివాసి చదువుల తల్లి కుమారి వాసం సుస్మిత ను సంస్థ టీం కలుసుకుని అభినందించారు. తన యొక్క ఐఐటి చదువుల కోసం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు చేతులమీదుగా 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఆమె యొక్క ఐ.ఐటి చదువులకి ఇంకా ఎంతో ఆర్థిక సాయం అవసరం ఉన్నందున ఐ.టీ.డీ.ఏ నుండి మంత్రి డాక్టర్ సీత క్క ద్వారా త్వరగా ఆర్ధిక సహాయం అందే విధంగా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఐ.ఐ.టీ.లో ఉత్తమ ప్రతిభను కనబరిచి, గొప్ప స్థాయిలో ఉండాలని తద్వారా తల్లి దండ్రులకి, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకు రావాలని అమ్మ స్వచ్చఃధ సేవాసంస్థ వ్యవస్థ పకులు పీర్ల కృష్ణ బాబు విథ్యార్థిని సుస్మితని అబినందిస్తూ, ఆశీర్వదిం చారు. ఈ సందర్భంగా పేద విథ్యార్దిని కి సహాయం అందించినందుకు స్థానికులు అమ్మ ఫౌండేషన్ ని అభినందిం చారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు పి. దిలీప్ కుమార్, లవన్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.