వెంకటాపురం సంతలో డిస్కౌంట్ దుస్తులకు బలే గిరాకి

వెంకటాపురం సంతలో డిస్కౌంట్ దుస్తులకు బలే గిరాకి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం గిరిజన సంతలో మంగళవారం ప్రముఖ బట్టల తయారీ మిల్స్ నుండి సూక్ష్మ లోపాలున్న నూతన దుస్తులు విక్రయాలు సంతలో జోరుగా సాగాయి. యువకులు, యువతులు, మధ్య వయస్కులు, మహిళలు ధరించే అన్ని రకాల దుస్తులను హిందీ భాష రాష్ట్రాల నుండి వ్యాపారులు సంతలో విక్రయాలు జరిపారు. 250 నుండి 100 రూపాయల వరకు కావలసిన దుస్తులు, టీ షర్ట్లు ,చలి కోట్లు, మహిళల దుస్తులు, జీన్స్ ప్యాంట్లు, చలికి తట్టుకునే రంగులు,చలి కోట్లు సంతకు వచ్చిన ప్రజలు తమకు నచ్చిన దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అవే దుస్తులు బట్టల దుకాణాల్లో, షోరూంలో జిగేల్ ,జిగేల్ అనే కాంతులలో,శీతల క్లాత్ షాపులలో మూడు నాలుగు రెట్లు అధిక ధరలు ఉంటాయని, కొనుగోలుదారులు ఆనంద వ్యక్తం చేస్తూ, నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకొని కొనుగోలు చేశారు. మండల రెవిన్యూ కార్యాలయం ఎదుట సుమారు 30 అడుగుల పొడవున బల్లలపై లాట్లు గా దుస్తులను ప్రదర్శించడంతో, దుస్తులు కొనుగోలు దారులతో సందడి నెలకొంది.