తపాల శాఖ బ్యాంకింగ్, బీమా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

Written by telangana jyothi

Published on:

తపాల శాఖ బ్యాంకింగ్, బీమా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

– భద్రాచలం పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపర్డెంట్ అశోక్ కుమార్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తపాలా శాఖ భద్రాచలం సబ్ డివిజన్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం బ్రాంచ్ పోస్టు ఆఫీసు లో మంగళ వారం డి.సి.డి.పి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పోస్ట్ ఆఫీస్ లో లభిస్తున్న అన్ని రకాల ఖాతాదా రులకు సేవల సౌకర్యాలు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సేవలు గురించి ఎఎస్పీ ఐ.అశోక్ కుమార్ వివరించారు. సమావేశం లో ఆయన మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో తపాలా శాఖ గ్రామ ప్రజల కోసం, గ్రామీణ, చిన్న మొత్తాల పొదుపు, సేవింగ్ అకౌంట్, పి .పి ఎఫ్, టీ.డీ, ఎస్.,సిఎస్ఎస్ ,ఎం.ఎస్.ఎస్సి, డిపాజిట్ తో అధిక వడ్డీ, అకౌంట్,గ్రామీణ తపాలా జీవిత భీమా, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వారు, తపాలా జీవిత భీమా పథకం, పొంచవచ్చునని తెలిపారు. తక్కువ ప్రీమియం అధిక బోనస్ పొందవచ్చు నని తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి రూ.520 ప్రీమియం తో, పది లక్షల భీమా, రూ.755 తో 15లక్షల భీమా పొందవచ్చు నని తెలిపారు. ప్రతి తపాలా కార్యాలయాలలో ఈ పధకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పోస్టల్ సిబ్బంది అందరు, ఈ పదకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లా లని, ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సబ్ పోస్ట్ మాష్టార్ సత్యనారాయణ, ఎం.ఓదుర్గాప్రసాద్, మరియు తపాలశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment