వెంకటాపురం హైస్కూల్లో బ్యాక్ టు స్కూల్ కార్యక్రమం
వెంకటాపురం హైస్కూల్లో బ్యాక్ టు స్కూల్ కార్యక్రమం
– విద్యార్థుల ర్యాలీ.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంమండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోమవారం బాలరక్ష భారత్ ప్యూర్ ప్లే మరియు , విద్యాశాఖ ములుగు వారి సమన్వయంతో, స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో సేఫ్ బ్యాక్ టు స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించి, బడిఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి .వి. వి.సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి బాల బాలికల వ్యత్యాసం చూపకుండా పిల్లలందరినీ పాఠశాలకు పంపించాలని, అది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీకాంత్ బాలరక్ష భారత్ ప్రతినిధి మాట్లాడుతూ, పాఠశాల పిల్లలకు అత్యంత సురక్షితమైన ప్రదేశం అని, బడి ఈడు పిల్లలు ను పాఠశాలలో చేర్పించాలని, విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.జయారాo , హరి సింగ్ , శ్రీరాం మూర్తి తదితరులు పాల్గొన్నారు.