ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన
ఏటూరునాగారం, తెలంగాణా జ్యోతి : పీఎంఆర్సి భవనంలో ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ములుగు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే రాధిక హాజరై ఏడు రోజుల క్యాంపులో భాగంగా బుధవారం విద్యార్థులకు హరితహారం పల్లె పకృతి వనం వల్ల కలిగే లాభాలను, పర్యావరణ పరిరక్షణను వివరించారు. అనంతరం చిన్న బోయినపల్లిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అమూల్య స్వర్ణ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.