పీ హెచ్ డీ అవార్డు పొందిన మహేష్ కుమార్ 

Written by telangana jyothi

Published on:

పీ హెచ్ డీ అవార్డు పొందిన మహేష్ కుమార్ 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బూడిద పల్లి గ్రామానికి చెందిన పొన్న మహేష్ కుమార్ డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. జే ఎన్ టీ యూ కాకినాడ వారి ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు లభించింది. ఎఫీషియెంట్ అప్రోచెస్ ఫర్ డిరైవింగ్ హై యుటిలిటీస్ ఫ్రం డాటా స్ట్రీమ్స్ అనే సిద్ధాంత వ్యాసానికి మహేష్ కుమార్ డాక్టర్ పట్టా పొందారు. తన సిద్ధాంత వ్యాసాన్ని మహేష్ కుమార్ విజయనగరంలోని ఎం.వి.జి.ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సమర్పించారు. పొన్న మహేష్ కుమార్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు పొందడం పట్ల కాటారం మండలం పద్మశాలి నాయకులు, పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గాదె రమేష్, పద్మశాలి సంఘం నాయకులు ఎలుగం సత్యనారాయణ, దోమల సమ్మయ్య, పులి అశోక్, కొండ వెంకటేశ్వర్లు, మాచర్ల రాజేందర్, దాసరి గట్టయ్య, పలనాటి బలరాం, యెలుగం రవి, రాజేశం, రామస్వామి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment