ఎల్లారెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శిపై దాడి
ఎల్లారెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శిపై దాడి
-పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గురువారం దాడి చేశారు. ఈ క్రమం లో గ్రామ కార్యదర్శి రమేష్ శుక్రవారం ఉదయం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో సదురు వ్యక్తులపై పిర్యాదు చేశారు. కార్య దర్శి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సద్దుల బతుకమ్మ సందర్బంగా గ్రామంలో కార్యదర్శి ఏర్పాట్లు చేపట్టారు. ఏర్పాటు లో భాగంగా బతుక మ్మ ఆట స్థలం వద్ద డిజే ఏర్పాటు చేసారు.ఈ క్రమంలో కొంత సేపటికి డి జే పని చేయకపోవడం తో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు గ్రామస్తులు కార్యదర్శిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.