వెంకటాపురంలో దారుణం…
వెంకటాపురంలో దారుణం…
– వేడి నీటిలో పడ్డ బాలుడు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటాపురం మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన తాటి బద్రు ఇంట్లో వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెట్టాడు. అది తెలియని బాలుడు దేవి ప్రసాద్ ఆడుకుంటూ వచ్చి వేడి నీటిలో పడి పోయినట్లు తెలిపారు. కాగా, తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి వైద్యులు సిఫారసు చేసినట్లు తెలిపారు.