రాష్ట్ర స్దాయి కోకో క్రీడ‌కు ఏన్నికైన ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్దులు

రాష్ట్ర స్దాయి కోకో క్రీడ‌కు ఏన్నికైన ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్దులు

రాష్ట్ర స్దాయి కోకో క్రీడ‌కు ఏన్నికైన ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్దులు

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : హనుమ‌కొండ జేఏన్‌ య‌స్ స్టేడియంలో జ‌రిగిన ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్థాయి స‌బ్ జూనియ‌ర్ కోకో క్రీడ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బర్చి రాష్ట్ర స్థాయి కోకో క్రీడ‌కు ఏటూరునాగారం మండ‌లం చిన్న‌బోయిన పల్లి ఆశ్ర‌మ పాఠ‌శాలకు చెందిన విద్యార్దులు న‌లుగురు ఎంపి కయిన‌ట్లు పాఠ‌శాల పీఈటీ వెంక‌టేశ్వ‌ర్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ సంద‌ర్బంగా పీఈటీ వెంటేశ్వ‌ర్లు మాట్ల‌డుతూ ఈనెల జేఏన్‌య‌స్ స్టేడియంలో జరిగిన ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్థాయి స‌బ్ జూనియ‌ర్స్ కోకో క్రీడ‌ల‌లో ఆశ్ర‌మ పాఠ‌శా ల‌కు చెందిన 7వ తరగతి విద్యార్థులు మాస‌య్య‌, ర‌వి, చింటూ,ఉమేష్ ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి రాష్ట్రస్థాయి కోకో క్రీడ‌కు ఏంపికయ్యారని తెలిపారు.కాగా రాష్ట్రస్థాయి క్రీడ‌కు ఏంపీకైన న‌లుగురు విద్యార్దుల‌ను పాఠ‌శాల ప్ర‌దానోపాధ్యా యులు నాగేశ్వరరావు, ఉపాద్యాయులు అభినందించారు.