ఇంటర్మిడియట్ బోర్డు డైరెక్టర్ని కలిసిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
ఇంటర్మిడియట్ బోర్డు డైరెక్టర్ని కలిసిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
– వెంకటాపురం జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని వినతిపత్రం.
– స్వచ్చందంగా పని చేస్తున్న వారిని గెస్ట్ లెక్చరర్స్ గా కొనసాగించాలి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని నూతన ప్రభుత్వ జూని యర్ కళాశాలకు బోధనా అధ్యాపకులు లేక, మారుమూల ఏజెన్సీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, బోధనాధ్యా పకులను వెంటనే నియమించాలని ఏఎన్ ఎస్ రాష్ట్ర అధ్య క్షుడు కొర్స నర్సింహా మూర్తి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ను హైదరాబాద్లోని తన కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు. దేశానికీ స్వాతంత్రం వచ్చిన సుమారు 75ఏళ్ల తర్వాత మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కానీ కళాశాలలో చదువుతున్న వందమంది విద్యా ర్థులకు బోధించే వారు లేక నష్ట పోతున్నట్లు వివరించారు. నిరక్ష రాస్యత అధికంగా ఉన్న మారుమూల ఏజెన్సీ ప్రాంతం లో పాఠశాల విద్యతో పాటు, కళాశాల విద్యను కూడా బలోపేతం చేయాలని కోరారు. వెంకటాపురం జూనియర్ కళాశాలకు నూతన భవనం కూడా మంజూరు చేయాలని, జిల్లా పరిషత్ పాఠశాల యొక్క అదనపు గదుల్లో కళాశాల నడుపుతున్నారని అన్నారు. నాలుగు గ్రూప్ ల విద్యార్థులను ఒకే రూమ్ లో కూర్చో పెట్టడంతో, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఏజెన్సీ గిరిజన మండలాల్లో ఉన్న జూనియర్ కళాశాలల పై ప్రత్యేక దృష్టి సారించాలని వసతు లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతం లోని పాఠశా ల, కళాశాల విద్య పైన ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కృష్ణ ఆదిత్యను కోరినట్లు వివరించారు. నూతన కళాశాల లో వందమంది విద్యార్థులకు బోధించే అధ్యాపకులు లేక నష్ట పోతుంటే, అర్హత, అనుభవం కలిగిన స్థానికులు స్వచ్చందంగా విద్యార్థు లకు బోధింస్తున్నట్లు అధికారి దృష్టికి తీసుకెళ్లారు . వారి సేవా భావాన్ని గుర్తించి వారినే వెంకటాపురం కళాశాలలో అతిధి అధ్యాపకులుగా నియమిస్తే వారికి న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్(ఆర్ జె డి )జయ సుధ ని ప్రత్యేకంగా కోరినట్లు తెలియ పర్చారు. అధ్యాపకులు లేకుండా విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవడం తో, విద్యార్థు లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వెంకటాపురం ప్రభు త్వ జూనియర్ కళాశాలకు త్వరలోనే బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామని, నూతన భవనం కూడా మంజూ రు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్ బోర్డు ఎడ్యు కేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని, ఏజెన్సీ మండ లాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అధ్యాపకుల కొరత లేకుండా చూస్తామన్నారు.వసతుల కల్పన కూడా జరు గుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంత కళాశాల విద్యను పటిష్టం చేసి బలోపేతం చేస్తామని తెలిపినట్లు నర్సింహా మూర్తి మీడి యాకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిశ ప్రేమ్ కుమార్, బాసని రమేష్, కోటేష్,పూనెం ప్రసాద్ తదిత రులు పాల్గొన్నారు..