పట్టభద్రులంతా ఓటరు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులంతా ఓటరు నమోదు చేసుకోవాలి
– ఐదు లక్షల ఓటర్ల నమోదు లక్ష్యం
– టిఎంసి మెంబర్ డాక్టర్ రాజ్ కుమార్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: త్వరలో జరగనున్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలలో పాల్గొనే పట్టభద్రులంతా ఓటరు నమోదు చేసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ కోరారు. కాటారం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. తాము ఇటీవల నూతనంగా తెలంగాణ గ్రాడ్యవేట్స్ ఫోరమ్ ఏర్పాటు చేశామని ఇందులో భాగంగా నాలుగు జిల్లాలలో కలిపి 42 నియోజకవర్గాలలో 42 మంది కో ఆర్డినేటర్లను నియమించి ఓటరు నమోదుకు విస్తృత ప్రయత్నాలు చేస్తన్నామని అన్నారు . కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో ఐదు లక్షల ఓటర్ల నమోదే లక్ష్యంగా విస్తృతంగా పర్యటిస్తూ తీవ్ర కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. 2021 నవంబర్ వరకు గ్రాడ్యుయేట్స్ పట్టా పొందిన ప్రతి ఒక్కరు ఈ ఓటర్ నమోదుకు అర్హులని అన్నారు. ఇది ఆన్ లైన్లైన్, ఆఫ్ లైన్ రెండు పద్ధతుల ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసు కోవచ్చని అన్నారు. ఆఫ్ లైన్ పద్దతిలో ఓటు హక్కు నమోదు చేయాలనుకునే పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు ఫారం నింపి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేయా లని కోరారు దీని కోసం డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, జిరాక్స్ ప్రతులతో పాటు ఫోటో, ఈ మెయిల్ ఐడి అందజేయాలని స్క్రూట్ని తరువాత ఓటరు జాబితాలో రిజిస్టర్ అవుతుందని పేర్కొన్నారు. ఆన్ లైన్ పద్దతిలో చేసేవారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు పంపాలని తెలిపారు.