ఆదర్శలో అలరించిన బతుకమ్మ సంబరాలు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ లో మంగళవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ సంబ రాలు అలరించాయి. విద్యార్థినిలు రంగు రంగుల పూలతో బతుకమ్మలు పేర్చి సంప్రదాయ దుస్తులలో తరలివచ్చి సంబ రాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి.అనంతరంఉత్తమ బతుకమ్మలకు, సాంస్కృ తిక కార్యక్రమాల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ జనగామ కృషిత, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.