వెంకటాపురం గిరిజన గురుకుల కళాశాల, పాఠశాలల్లో ప్రవేశాలు
వెంకటాపురం గిరిజన గురుకుల కళాశాల, పాఠశాలల్లో ప్రవేశాలు
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఆధ్వర్యంలోని టీ.జీ. టీ. డబ్ల్యూ. యు. ఆర్. జె .సి. ( జి)(నూగూరు వెంకటాపురం) వాజేడు నందు 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హత గల గిరిజన బాలికలు థరఖాస్తులు చేసు కోవాలని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ప్రిన్సిపాల్ ఎస్. నాగేంద్రమ్మ మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం నందు ఎం.పీ.సీ. లో 37 సీట్లు, బైపీసీ.లో 26 సీట్లు, మరియు ఐదవ తరగతిలో 9 సీట్లు, ఆరో తరగతిలో ఐదు సీట్లు, ఏడో తరగతిలో 30 సీట్లు,వంతున స్పాట్ అడ్మిషన్స్ ను ఆగస్టు రెండో తారీకు వరకు జరుగునున్నాయి.ఆసక్తి గల విద్యార్థులు వారి యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాఠశాలకు విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఈ సువర్ణ అవకాశం ఓన్లీ ఎస్టీ, అభ్యర్థు లకు మాత్రమే అవకాశం కలదు. ఆసక్తి గలవారు. 7989395705,9182752520, 9391195647, నెంబర్లలో సంప్రదించగలరని ప్రిస్సిపాల్ కోరారు.