గర్భిణీ స్త్రీకి రక్తదానం చేసిన యువనేత 

Written by telangana jyothi

Published on:

గర్భిణీ స్త్రీకి రక్తదానం చేసిన యువనేత 

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: అత్యవసర పరిస్థితు లలో నిండు గర్భిణీకి రక్తదానం చేసి రెండు ప్రాణాలను కాపాడిన యువనేత ఇందుకు సంబంధించిన వివరాలు… జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని వంద పడకల ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ కి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. బి పాజిటివ్ రక్తం అవసరమై ఉండగా సదరు గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ వారిని సంప్రదించారు. ఈ మేరకు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్న యువ నాయకుడు కడారి విక్రమ్ ను వాకబు చేశారు. అయితే తానే గొరేపల్లి నుంచి స్వయంగా వెళ్లి భూపాలపల్లి వంద పడకల హాస్పిటల్ లో రక్తదానం చేసినట్లు తెలిపారు. దాంతో బుధవారం గర్భిణి స్త్రీకి రక్తం ఎక్కించి వైద్యులు ప్రాణాలు కాపాడారు. రక్తదానం చేసిన సేవ సంస్థ సభ్యులను, యువనేత కడారి విక్రమ్ ను పలువురు సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ఆపదలో ఉన్నవారికి అవసరమయ్యే గ్రూపు రక్తాన్ని తమ సంస్థ సభ్యులు రక్తదానం చేస్తామని స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన నిర్వాహకులు కొట్టే సతీష్ తెలిపారు.

Leave a comment