నకిలీ విత్తనాలు అమ్మే డీలర్ల పై చర్యలు తీసుకొవాలి
- నాణ్యమైన విత్తనాలు రైతులకు సకాలంలో అందించాలి
- ఎస్టిమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోనీ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రైతు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కాగానే రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేయడం జరుగుతుందని అన్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అమ్మేతే ప్రభుత్వం, అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు . రైతులు ఎవరు కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని నకిలీ విత్తనాలు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ కి పిర్యాదు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు కూడా నిజమైన విత్తనాల లాగానే ఉంటాయి కానీ పూత పూయదు కాతకాయదు అని అన్నారు. విత్తన దుకాణాలలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చెయ్యాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలలో అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని అన్నారు . ప్రధానంగా డీలర్లు నాణ్యమైన విత్తనాలు అందిచాలని , రైతులకు బలవంతంగా యిష్టం లేని విత్తనాలు ఇవ్వకూడదని అన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలని రైతుకు కూడా విత్తనాలు కొనేపుడు బిల్లులు తీసుకోవాలని అన్నారు . డీలర్ల నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోని షాపులను సీజ్ చెయ్యాలని అధికారులకు సూచించారు .