প্রিন্ট এর তারিখঃ জুলাই ২, ২০২৫, ৩:১৩ এ.এম || প্রকাশের তারিখঃ জুন ১৪, ২০২৪, ৯:৪৪ পি.এম
Aadhaar Update : ఆధార్ అప్డేట్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.
Aadhaar Update : ఆధార్ అప్డేట్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.
డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగదారుల అప్డేట్ కోసం మరో మూడు నెలలు గడువును (UIDAI) పెంచి మరో అవకాశం కల్పించింది. గతంలో ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియడంతో మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది (2024) సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే అవకాశమిచ్చినట్లయింది.
‘MyAadhaar’ మెనూ నుంచి ‘Update Your Aadhaar’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొండి.
ఆపై 'అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆధార్ కార్డ్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కోసం రీడిజైన్ చేయబడిన ఇంటర్ఫేస్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఆధార్ అప్డేట్ చేయడానికి ప్రొసీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను రిజిస్టర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేయండి
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి
OTPని ఎంటర్ చేసిన తర్వాత మళ్లీ ‘అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా’ అప్షన్ పై క్లిక్ చేయండి.
అడ్రస్ మార్చడానికి ‘అడ్రస్’ అప్షన్ పై క్లిక్ చేయండి.
కొత్త అడ్రస్ సమాచారాన్ని ఎంటర్ చేయండి. వాటితో పాటు కొత్త అడ్రస్ వెరిఫికేషన్ ప్రూఫ్స్ అప్లోడ్ చేయండి.
మీ కొత్త అడ్రస్ సమాచారాన్ని ఎంటర్ చేయండి, అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి. అందించిన సమాచారం సరైనదేనని మళ్లీ కన్ఫర్మ్ చేయండి.
సర్వీస్ కు సంబంధించిన ఏవైనా ఛార్జీలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి.
చివరగా ఇప్పుడు మీరందుకున్న URNతో స్టేటస్ చెక్ చేయవచ్చు