భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక
– మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్
ములుగు ప్రతినిధి : వందల సంవత్సరాలు బ్రిటిష్, ముష్కరుల చేతిలో బానిసగా బతికిన భారతీయులు ఎంతోమంది వీరుల త్యాగాలతో ప్రస్తుతం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని మల్కాజ్ గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ములుగులో హార్ ఘర్ తిరంగా అభయాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిం చిన ర్యాలీలో ఈటెల పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నినాదాలు చేశారు. భారతీయ సంస్కృతి, సాంప్ర దాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డాక్టర్ కాళీ ప్రసాద్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాయించు నాగరాజు, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.