గ్రామీణ వైద్యుడు నాగేశ్వరరావు మృతి – పలువురి సంతాపం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో గ్రామీణ వైద్యుడిగా పని చేస్తున్న కర్ని నాగేశ్వరరావు (38) అనారో గ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామీణ వైద్యుల సంఘం నూగూరు వెంకటాపురం మండల శాఖ, సంఘం సభ్యులు, ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. స్వగ్రామమైన జానంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.