ఆగస్టు 4న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకం గా వరంగల్ లో రాష్ట్ర సదస్సు
ఆగస్టు 4న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకం గా వరంగల్ లో రాష్ట్ర సదస్సు
– తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీ ఏ కె ఎస్) రాష్ట్ర నాయకుడు దాసరి రమేష్
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: ఆగష్టు 4వ తారీకు వరంగల్ లో కార్మిక వర్గ హక్కులకై, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీ ఏ కె ఎస్) రాష్ట్ర నాయకుడు దాసరి రమేష్ తెలిపారు. ఈ సదస్సును కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆటో కార్మికులకు రమేష్ పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం, మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ రంగాలలో పని చేస్తున్న ప్రతి కార్మికునికి కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ఇప్పుడు ఉన్న కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని అన్నారు. భూపాలపల్లి ఆటో స్టాండ్ యూనియన్ కార్యదర్శి ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరారు. ఇంకా మన దేశంలో 44 కోట్ల అసంఘటీత కార్మికులుగా, తెలంగాణలో ఉన్న కోటి 50 లక్షల మంది కార్మికుల కోసం అసంఘటీత రంగాన్ని సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 4వ తారీకు జరిగే సదస్సును విజయవంతం చేయాలనీ కోరుతూ మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగా ణ అసంఘటీత కార్మిక సంఘాల సమాఖ్య కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. అసంఘటిత కార్మిక సంఘం భూపా లపల్లి జిల్లా కార్యదర్శి అయితే బాపు మాట్లాడుతూ నిరుపేద లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్, సాని టేషన్, పేషంట్ కేర్ ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ కార్మికులు ఎం మల్లేష్, శ్రావణ్, రాజకుమార్, కృష్ణ, రవితేజ, శ్రీకాంత్, స్వామి, చాంద్ పాషా లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు.