మావోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తం

Written by telangana jyothi

Published on:

మావోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తం

– నైట్ హాల్ట్ బస్ సర్వీసులు రద్దు.

– పోలీస్ స్టేషన్ల కు బస్సులు తరలింపు. 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, పేరూరు, వాజేడు, వెంకటాపురం పోలీస్ స్టేషన్లలో మావోయి స్టుల బందు పిలుపుతో నాలుగైదు రోజుల క్రితమే రెడ్ అలెర్టు ప్రకటించారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా పోలీస్ శాఖ అదనపు బలగాలతో అటవీ ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్లు, వాహనాలు తనిఖీలు, అటవీ గ్రామాల్లో సరిహద్దు అటవీ గ్రామాల్లో కార్టేన్ అఃడ్ చర్చ్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటం, సరిహద్దు సతీష్గడ్ రాష్ట్రం అటవీ ప్రాంతాల్లో సైతం ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయంతో, దట్టమైన ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు బలగాల ను మోహరిం చారు. గత రెండు,మూడు రోజులుగా భారీ వర్షాలు, గోదావరి వరదలు తగ్గుముఖం పట్టటంతో ప్రజలు ఊపిరి పీల్చుకు న్నారు. అటవీ గ్రామాల్లో అనేక కొండ వాగులు సైతం శాంతించాయి. కాగా ములుగు జిల్లా ఉన్నతాధికారులు , పోలీసు యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రాంతం లో పోలీసులు పతిష్టమ్మన భద్రత, పకడ్బందీ వ్యూహంతో కూడిన ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఏదో ఒక ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు దుశ్చర్య లకు పాల్పడే అవకాశం ఉందని గూడచారి శాఖ , ఇంటలి జెన్సీ విభాగం సమాచారంతో, పోలీస్ శాఖ మరింత అప్రమత్త అఇంది. హిట్ లిస్టులో వున్న పార్టీ నేతలను, ప్రజాప్రతి నిదులను, పోలీస్ శాఖ అనుమతులు లేకుండా గ్రామాల్లోకి వెళ్ళవద్దని, భద్రతాపరమైన చర్యలు తో పోలీస్ శాఖ సూచనలు పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనేకమంది నేతలు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు సమాచారం. అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో మావోయిస్టు ల బంద్ పిలుపు తో బంద్ పా క్షింకగా జరిగింది .12 గంటల తర్వాత వర్తక సంఘం ఒకరి తర్వాత ఒకరు షాపులు షట్టర్లు ను పైకి లేపారు. బ్యాంకులు, వర్తక వాణిజ్య సంస్థలు యధావిధిగా పని చేశాయి. అయితే ఆయిల్ బంకులు మూసి వేసినట్లు సమాచారం. భద్రాచలం, వరంగల్ డిపోలకు చెందిన ఆర్టీసీ నైట్ హాల్ట్ సర్వీస్ లను వాజేడు, పేరూరు, వెంకటాపురం పోలీస్ స్టేషన్లో సమీపంలో భద్రత నిమిత్తం బస్సులు నిలిపి ఉంచినట్లు సమాచారం. అలాగే గోదావరి ఇసుక సొసైటీలు క్వారీల వద్ద లోడింగ్ భారీ యంత్రాలు, లారీలను సురక్షిత ప్రాంతాల కు తరలించినట్లు సమాచారం. వెంకటాపురం పట్టణ సమీపంలోని శివాలయం వద్ద నుండి రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో,సోమవారం రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 మరమ్మత్తులు పనులు సైతం ఉదయం నుండి కొంతవరకు పనిచేసి,అనంతరం నిలిపివే శారు. ఆయా భారీ యంత్రాలను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.ఇటీవల పోలీస్ రికార్డుల లలో నమోదు ఆయిన పాత మావోయిస్టు ల సానుభూతి పరులకు స్సతం పోలీసుఅదికారులు కౌన్నిలింగ్ నిర్వహించి,మావోయి స్టులకు సహకరించవద్దని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచా రం.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now