ఓటు హక్కు పై ఇంటింటి సర్వే నిర్వహించాలి
ఓటు హక్కు పై ఇంటింటి సర్వే నిర్వహించాలి
– బి ఎల్ ఓ లకు శిక్షణ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు హక్కు పై అవగాహన కల్పించాలని, అదేవిధంగా అర్హులైన వారిని ఓటర్లుగా గుర్తించాలని కాటారం తహసిల్దార్ నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిషత్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు ఓటరు జాబితా తయారీ, ఓటు హక్కు పై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి తప్పులు ఉన్న వాటిని ఫారం ఎనిమిది ద్వారా సరిచేయాలని సూచించారు. ఓటర్ లిస్టులో ఎవరైనా చనిపోయిన ఎడల వారిని గుర్తించి ఫారం 7 లో నమోదు చేయాలని వివరిం చారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఫారం ఆరు ద్వారా నూతనంగా ఓటు హక్కు కల్పించాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి అధికా రులు గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి పారద ర్శకంగా ఓటరు జాబితాను తయారు చేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, మండల తహసిల్దార్ కార్యాల యం సీనియర్ సహాయకులు, గిర్ధవార్లు, జూనియర్ సహాయ కులు తదితరులు పాల్గొన్నారు.