ఏపీజీవీబీ వెంకటాపురం బ్రాంచ్ నూతన భవనంలోకి మార్పు
– బ్రాంచ్ ను ప్రారంభించిన రీజినల్ మేనేజర్ చైతన్య కుమార్
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పట్టణ కేంద్రంలోని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్రాంచిని, అదే రోడ్లోని జగదాంబ థియేటర్ సమీపంలో నూతన అద్దె భవనంలోకి గురువారం మార్చారు. వేలాది మంది ఖాతాదారులు కలిగిన ఏపీజీవీబీ లో ప్రస్తుతం ఉన్న భవనం ఖాతాదారుల సౌకర్యం కోసం సరిపోవటం లేదని, విశాలమైన నూతన అద్దె భవనంలోకి బ్యాంకును మార్చారు. ఈ మేరకు ఏపీజీవీబీ నూతన భవనం బ్రాంచ్ని రీజినల్ మేనేజర్ చైతన్య కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు అందుతు న్న బ్యాంకు సేవలు ను గురించి, రీజనల్ మేనేజర్ ఖాతాదా రులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీ వీబీ చీఫ్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు, సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ వెంకట రామాచారి, వెంకటాపురం బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ కుమార్, క్యాషియర్ రాజు, బ్యాంకు మిత్రాలు బొగ్గుల రామలక్ష్మి, ప్రశాంత్, స్వరూప, బి. పుష్పలత, స్వరూప రాణి,అటెండర్ కె.చంద్రం తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వెంకటాపురం పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, పుర ప్రముఖులు ఖాతాదారులు కే. సుందర్ రావు, కృష్ణమూర్తి ఎస్. సత్యనారా యణ, మన్యం సునీల్, ఇంకా పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం సీనియర్ ఖాతాదా రులు ఎస్. సత్యనారాయణ తన సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో రీజినల్ మేనేజర్ చైతన్యకుమార్ చేతులు మీదుగా నగదును క్యాషియర్ కౌంటర్లో అందజేసి తన అకౌంట్లో జమ చేయిం చారు.నూతన భవనంలో తొలి ఖాతాదారుడుగా సేవలు పొందిన ఆయనను పలువురు అభినందించారు.