ఘనంగా పదహారు పండుగ.
ఘనంగా పదహారు పండుగ.
కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పదహారు పండుగ ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించి నేటికి పదహారు రోజులు కావడంతో ఆలయాధికారులు పదహారు పండుగ నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ రామాలయంలో ప్రధాన ఉత్సవ మూర్తులకు సంప్రోక్షణ పూజలు, షోడోసోపచార,చతుర్వేద సేవలు,తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ్ర ప్రసాదాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.