శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎలక్షన్ అబ్జర్వర్.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని పెద్దపల్లి ఎలక్షన్ అబ్సర్వర్ శ్రీ. రవిష్ గుప్తా దర్శించుకున్నారు. ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఏమార్వో ప్రహ్లాద్ రాథోడ్ , మహాదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.