దేవరాంపల్లి లో 35 వాహనాల సీజ్ 

దేవరాంపల్లి లో 35 వాహనాల సీజ్ 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి లో సోమ వారం సాయంత్రం పోలీసులు కార్దన్ సెర్చ్ చేపట్టారు. కాటారం ఎస్ఐ మ్యాక అభినవ్ ఆధ్వర్యంలో కొయ్యూరు, అడవి ముత్తారం ఎస్ఐ ల తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరించినట్లైతే వంద నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్ఐ అభినవ్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు సాఫీగా జరిగేందుకు ప్రజలు తమ ఓటు హక్కును అందరూ సద్విని యోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 35 వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. ఎనిమిది వాహనాలకు నంబర్ ప్లేట్లు లేవని అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేసినట్లయితే, వాహనంతో పాటు పిల్లలు, వారి తల్లి దండ్రులపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట రీత్యా చర్యలు చేపట్ట నున్నట్లు హెచ్చరించారు. 108 అంబులెన్సు వాహనాలకు దారి ఇవ్వాలని, రోడ్డు భద్రతా నియమాలను అందరు వాహన చోదకులు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు, వాహన చోదకులు ఏర్పాటు చేసిన సమావేశం లో ఎస్ఐ అభినవ్ పేర్కొన్నారు.