ఇసుక క్వారీలతో పొంచి ఉన్న ప్రమాదం
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : మండల కేంద్రంలో అవతలి వాడలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలతో ఏటూరునాగారానికి గోదావరి వరద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన గురవుతున్నారు. కరకట్టకు ఆనుకొని ఉన్న జంపన్న వాగులో నుండి ఇసుక తీయడంతో కర్రకట్టకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది అధికారులు వెంటనే చర్యలు తీసుకుని క్వారీలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు కరకట్టకు 100 మీటర్ల దూరంలో ఇసుక ర్యాంపు ల ఏర్పాటు కరకట్టకు వరద ముప్పు ఉందని తెలిసినా ఇసుక ర్యాంపులకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు.