సెప్టెంబర్ 17వ తేదీని విలీన దినోత్సవం గా నిర్వహించాలి

సెప్టెంబర్ 17వ తేదీని విలీన దినోత్సవం గా నిర్వహించాలి

ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ నైజాం నవాబును తరిమి కొట్టిన కమ్యూనిస్టులు, ప్రజా పోరాటాలను కనుమరుగు చేయాలను కోవడం ఎవ్వరి తరం కాదన్నారు. కమ్యూనిస్టులు చేసిన వీరోచిత పోరాటాల వల్లనే నరహంతక నైజాం నవాబును వారి తాబేదారులను తరిమి కొట్టడం వల్లనే నిజాం నవాబు కేంధ్ర ప్రభుత్వానికి లొంగిపోయారే తప్ప మరెవరి పాత్ర లేద న్నారు. సెప్టెంబర్ 17 తేదీని అధికారికంగా నిర్వహించడాన్ని ఆహ్వానిస్తున్నాము కానీ ప్రజాపాలన అనే పేరు పెట్టడమే సరైన విధానం కాదన్నారు. విలీన దినోత్సవం పేరుతో నిర్వ హించి నాటి పోరాట యోధులను స్మరించుకోవాలని కమ్యూ నిస్ట్ పార్టీలను ఆనాయకులను కూడా ఆహ్వనించాల్సి ఉండే దని అన్నారు. నాటి పోరాటం లో ఏ మాత్రం పాత్ర లేని బిజేపి పార్టీ ఈ కార్యక్రమాన్ని హైజాక్ చేసి కమ్యూనిస్ట్ పోరాటాలను భావితరాలకు తెలువకుండా చేయడానికి ప్రయత్నించడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యండి, అంజధ్ పాష, సిపిఐ ములుగు మండల కార్యదర్శి ముత్యాల రాజు,వెంకటాపూర్ మండల కార్యదర్శి బండి నర్సయ్య, గోవిందరావుపేట మండలం కార్యదర్శి వడి సారయ్య, ఇంజం కొమురయ్య, బోడ రమేష్, జక్కుల అయిలయ్య, మాతంగి శ్యాంసుందర్, మామిడి నటరాజ్,కొండ కుమార్,మొలుగూరి రాంబాబు,తోట సంపత్, పరంసింగ్, పైడయ్య, జితేందర్, రవి, రాజు, సమ్మ య్య, మల్లయ్య, కవిత,సమ్మక్క,సారయ్య, లింగయ్య,రొంటాల రమేష్, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు