వరి పొలం లో డ్రోన్ తో పురుగు మందు పిచికారి
– నానో ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం లో నానో ఇఫ్కో యూరియా ఫెర్టిలైజర్ కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్ లతో తక్కు వ ఖర్చుతో పంట పొలాలపై మందులు పిచికారి చేసే విధా నాన్ని రైతులకు క్షేత్రస్థాయిలో కంపెనీ ప్రతినిధులు అవగా హన కల్పించారు. మారుమూల ప్రాంతాల్లో రైతులకు సులు వైన పద్ధతిలో డ్రోన్ ద్వారా మందును స్ప్రే చేయడం సులు వైన పద్ధతి గా అభివర్ణించారు.చండ్రుపట్ల గ్రామానికి చెందిన శ్రీరామ ఫెర్టిలేజర్ షాప్ యజమాని గొర్లపల్లి రాంబాబు రైతులకు, వారి పంట పొలాల్లో ఉపయోగ పడే విధంగా డ్రోన్ ను రైతులకు అందుబాటులో తీసుకు వచ్చారు. ఈ సంద ర్భంగా టేకులగూడెం గ్రామంలో యాలం రాంబాబు అనే రైతు కు చెందిన వరి పొలములో మందును స్ప్రే చే సేరు. ఈ సందర్భం గాడ్రోన్ ఆపరేటర్ గొర్లపళ్లి నవీన్ మాట్లాడుతూ నానో ఇఫ్కో యూరియా ఫెర్టిలేజర్ కంపనీ వారు సబ్సిడీ ద్వారా డ్రోన్ అందించి దానిని అపరేట్ చేసే విదానం పై చెన్నై లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. రైతులు పొలం నీళ్లలో లో దిగి మందు కొట్టే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుందని కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా డ్రోన్ తో మందు కొట్టుకోవడం వల్ల డబ్బులు కూడా సమయం, ఆదా అవుతుందని అన్నారు. పొలం లో మందు కొడితే ఎకరాకు సబ్సిడీ మీద 300 రూ. చార్జీ అవుతాయనీ వారు తెలియజేయడం జరిగింది. టేకుల గూడెం గ్రామం లో ఉన్న రైతు యాలం రాంబాబు ఈ సంద ర్బంగా మాట్లాడుతూ పొలం లో డ్రోన్ ద్వారా మందు స్ప్రే చేయడం వలన పొలం లో డ్రోన్ ద్వారా పూర్తిగా మందు వరి మొదలు లోకి వెళుతుంది. అలాగే కూలీ ఖర్చులు తగ్గు తాఇ. అలాగే సమయం కూడా అదా అయ్యిందన్నారు.ఈ క్లిష్ట మైన పరిస్థితుల్లో మందు కొట్టడానికి కూలీలు దొరకని పరిస్థితి కాబట్టి డ్రోన్ తో మందు కొట్టడం సులభతరంగా వుంటుందని తెలిపారు. ఆపరేటర్ గొర్లపల్లి నవీన్,రైతు యాలం రాంబాబు, గట్టీపల్లి తిమోతీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.