తెలంగాణ జ్యోతి, నవంబర్ 21, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులకు వెలుతుర్లపల్లి గ్రామంలోని సమత ప్లయాష్ బ్రిక్స్ యాజమాన్యం ఆశాడపు హరిచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆషాడపు హరిచంద్ర మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టుల సేవలను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం తమ వంతు సహకారం అందించాల న్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బేతి సతీష్, ఒద్దుల మురళి, రంగీశెట్టి రాజేందర్, దండపెళ్లి సారంగం, పోశాల చంద్రమోగిలి, బాణోత్ యోగి, ఎలగందుల శంకర్ పిల్లలమర్రి శివరాం మామిడి శెట్టి ధర్మతేజ మామిడి సంపత్ గట్టు, దేశిని మహేందర్, బిరెల్లి రమేష్, ప్రశాంత్ ఎండి రఫీ ఆకుల రామకృష్ణ దేశిని వినిల్ తదితరులు పాల్గొన్నారు