వెంకటాపురం పోలీస్ సర్కిల్లో మావోయిస్టుల యాక్షన్ టీం ల సంచారం.
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డోన్ కెమెరాలు ఏ ర్ఫాటు.
- అప్రమత్తమైన పోలీసులు : అదనపు పోలీస్ బలగాల మొహరింపు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్లో ఎన్నికలను బహిష్కరించాలని, నిషేదిత మావోయిస్టులు ప్రకటిం చడంతో, ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్త మైంది. ఇందులో భాగంగా యాక్షన్ టీం ల సంచారంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తం కాగా, మావోయిస్టుల కవింపు చర్యలను తిప్పికొట్టేందుకు, అదనపు పోలీసు బలగాలను మోహరింప జేశారు.ఈ మేరకు అడవుల్లో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ల తో పాటు, అటవీ గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల సమాచారం కోసం ఎప్పటికప్పుడు నీఘాను తీవ్రతరం చేశారు. ఈ మేరకు మావోయిస్టు యాక్షన్ టీం ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని పి.ఎస్ . గ్రామాల్లో గోడలకు అట్టించి ప్రజలను అప్రమత్తం చేశారు. ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం వారం క్రితమే మీడియాకు విడుదల చేశారు. అలాగే వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు, పేరూరు, వెంకటాపురం, పీ.ఎస్ లతో పాటు ఆలుబాక సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులలో రెడ్ అలర్ట్ ప్రకటించారు., ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డోన్ కెమెరాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఆధునిక డోన్ కెమెరాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని నిక్షిప్తం చేసి, కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేశారు. భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ అమలు నాటినుండి మావోయిస్టులు తమ ఉనికిని కాపాడు కునేందుకు, ప్రజలను రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధుల ను భయభ్రాంతులకు గురి చేసేందుకు చేసే పన్నాగాలను పోలీస్ శాఖ తిప్పికొట్టింది. అంతేగాక మావోయిస్టు ప్రభావిత ప్రాంతల నుండి , ఇతర ప్రాంతాల నుండి గోదావరి నదులు దాటి, ఈ ప్రాంతంలో దుశ్చర్యల కు పాల్పడే అవకాశం ఉందని గూడచారి నివేదికలతో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది .ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు విని యోగించుకునేందుకు, అవసరమైన భద్రతాపరమైన చర్యలు పోలీస్ శాఖ తీసుకున్నది. ఈ మేరకు అనేక పర్యాయాలు వెంకటా పురం పోలీస్ శాఖ సర్కిల్లో ప్రజలకు మనో ధైర్యం కల్పించేందుకు, స్వేచ్ఛగా ఓటింగ్ లో పాల్గొనేందుకు పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశంపై చర్యలు తీసుకుంటుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ పర్యవేక్షణలో ఆలుబాక సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపు సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, వెంకటాపురం ఎస్సై ఆర్. అశోక్ ,వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు, పేరూరు ఎస్సై రమేష్ లు ప్రత్యేక పోలీసు బల గాలతో, సివిల్ మరియు సి. ఆర్.పి.ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పు డు కూంబింగ్ ఆపరేషన్లు, వాహనాలు తనిఖీలు, కార్టన్ అండ్ సెర్చ్ మరియు ప్రేండ్లీ పోలీసింగ్ తదితర పోలీస్ శాఖ విధులను నిర్వహి స్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. అలాగే గోదావరి పెర్రి పాయింట్లు, పడవల రేవులు, మత్స్యకారుల పడవలపై పోలీస్ శాఖ డేగ కన్నుతో నిఘానేత్రంతో సమాచార వ్యవస్థను పతిష్టం చేశారు. ఆదివారం ఈ మేరకు వెంకటాపురం పోలీస్ సి.ఐ బి. కుమార్ , అలుబాక సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఎస్సై తిరుపతి రావు ఆధ్వర్యంలో, ఈ మేరకు మీడియాకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. యాక్షన్ టీం ఫోటోలుతో పాటు వారి పేర్లను కూడా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంపై విడుదల చేశారు. వెంకటా పురం, వాజేడు మండలంలో అనేక గ్రామాల లో వారం,పది రోజుల క్రితం నుండే ముఖ్య కూడలి లలో మావోయిస్టు ల యాక్షన్ టీం ల యొక్క ఫోటోల తో కూడిన వాల్ పోస్టర్లను పోలీస్ శాఖ గోడలకు అంటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటర్లు ప్రజలు మావోల మాయ మాటలు నమ్మవద్దని, స్వేచ్ఛగా ఓటింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ మేరకు ఎల్లవేళలా పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలతో విధులు నిర్వహిస్తున్నదని సి.ఐ బి. కుమార్ తెలిపారు. యాక్షన్ టీములు ఎన్నికలను బహిష్కరిం చాలని, పార్టీల నేతలను, పోలీస్ భద్రతా సిబ్బందిని భయ భ్రాంతు లకు గురి చేసే విధంగా, హతమార్చే విధంగా పన్నాగాలను పోలీస్ శాఖ ప్రతిష్టమైన వ్యూహంతో,భద్రతా పరమైన చర్యలతో మావోయి స్టుల కవ్వింపు చర్యలను తరిమికొట్ందు విధుల నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఓటర్ లు, ప్రజలు ఎవరైనా అపరి చిత వ్యక్తులు సంచారం పై ఎల్లవేళలా సమాచా రాన్ని ఇవ్వాలని, ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెంకటాపురం పోలీస్ సర్కిల్లో అదనపు పోలీసు బలగాల ను మోహరింపజేసి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా అడవులలో బలగాలు జల్లడ పడుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతాపరమైన చర్యలు,తోపాటు ఎన్నికలు ప్రశాంత వాతా వరణం లో జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, బ్యాలెట్ బాక్సుల తరలింపు తదితర భద్రతాపరమైన చర్యలను ముందస్తు ప్రణాళికతో పోలీస్ శాఖ పకడ్బందీ వ్యూహంతో, భద్రతా పరమైన చర్యలతో ముందుకు సాగుతున్నది. మరో నాలుగు రోజుల్లో 30 తేదీన జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతవరణం లో, జరిగేందుకు చర్యలు తీసుకొంటున్నది. ఈ మేరకు పోలీస్ అధికా రులు సుధీర్గ మ్మన ప్రెస్ నోట్ ను వెంకటాపురం లో ఆదివారం మీడియాకు విడుదల చేశారు.