వివిధ పార్టీల నుండి బి ఆర్ఎస్ లో భారీగా చేరికలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విజయాన్ని కాంక్షిస్తూ మండలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని బిఆర్ఎస్ ప్రచార కమిటీలు, కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా చేపట్టారు. ఇందులో భాగంగా బిఆర్ఎస్ కు పట్టువున్న పంచాయతీ గ్రామాలలో, వివిధ పార్టీల నుండి అనేకమంది బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, గులాబీ జెండాలను కండువాలను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలుబాక పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో సీనియర్ నాయకులు రైతు గొలకోటి నారాయణస్వామి తన అనుచరులు, బంధు మిత్రులతో ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో, పార్టీ సీనియర్ నేత షేక్ ముస్తఫా సాదరంగా వారిని ఆహ్వానించి పార్టీ కండువాలతో పార్టీలో చేర్చుకున్నారు. అలాగే వ్యవసాయ పనులు కారణంగా సాయంత్రం సమయంలో అటవీ గ్రామాల్లో సైతం ఇంటింటి టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పూజారి ఆది లక్ష్మీ , ఉపసర్పంచ్ సమ్మక్క పంచాయతీ పాలకవర్గం, కార్యకర్తలు ప్రచార కమిటీ నేతలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ, భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకే ఓటు వేయాలని,గెలిపించాలని ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ సీనియర్ నేత షేక్ ముస్తఫా తెలిపారు.