-బీఆర్ఎస్ గెలిస్తేనే జగదీష్ అన్న ఆత్మకు శాంతి.
- 10 ఏళ్ళల్లో సీతక్క చేసింది కెమెరాల ముందు మూటలు మోయడమే.
- 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులని ఆదుకున్నది లేదు.
- మల్లంపల్లి రోడ్ షోలో మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
- మీఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి.
- మల్లంపల్లి ఎన్నికల ప్రచారంలో బడే నాగ జ్యోతి.
తెలంగాణ జ్యోతి, నవంబర్ 21, ములుగు ప్రతినిధి : మల్లంపల్లి ముద్దుబిడ్డ,ఉద్యమ నాయకుడు దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆశయం ములుగు గడ్డపై బీఆర్ఎస్ ను గెలిపించి జగదీష్ అన్నా ఆశయాన్ని నెరవెర్చాలని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ములుగు ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్సీ ములుగు ఎన్నికల ఇన్చార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివంగత ములుగు జడ్పీ చైర్మన్ సుష్మ జగదీష్ సతీమణి రమాదేవితో కలిసి మల్లంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆడపడుచులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వారికి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలు, కోలాటాలు ఆడుతూ ప్రచారంలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ములుగు ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన ఉంటే బడే నాగజ్యోతి గెలుపు బాధితులు ఆయన భుజాలపై వేసుకునే వాడని ఈ సందర్భంగా మంత్రి సత్యవతి గుర్తు చేశారు. ఓటర్లు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని మోసపోయి ఓటు వేస్తే కోసపడాల్సి వస్తుందని అన్నారు 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పేద ప్రజలకు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. నిరుపేదలకు ఇల్లు కట్టేయలేని దౌర్భాగ్య స్థితిలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని కానీ కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసిఆర్ కి దక్కుతుందని అన్నారు. వృద్ధులు వికలాంగులకు 2000 రూపాయల పెన్షన్ అందించి ఆదుకున్న ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు ఉండేవని తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు శిథిలావస్థకు చేరుతుందని మంత్రి ఫైరయ్యారు. పది సంవత్సరాలు ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఈ నియోజకవర్గానికి తట్టడం మట్టి పూసిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పది సంవత్సరాల లో ఏం చేయలేని సీతక్క మళ్ళీ అభివృద్ధి చేస్తానని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 2018 ఎన్నికలలో మాజీమంత్రి ఆజ్మీర చందూలాల్ ను ఓడించినప్పటికీ సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారని అలాగే మల్లంపల్లిని మండలం తో పాటు ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ములుగు కు మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా మల్లంపల్లి ప్రజలందరూ కృతజ్ఞతగా ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత తెలపాలని అన్నారు. నాగజ్యోతిని గెలిపిస్తే మల్లంపిలో బస్టాండ్ నిర్మిస్తామని, అర్హులైన అందరికీ గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మిస్తామని అలాగే కోటి రూపాయలతో మహిళా భవన్ ను 25 లక్షలతో ఆయా కుల సంఘాల భవన్ లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
- సాకులు చెప్పాను పని చేసి చూపిస్తా : ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగ జ్యోతి.
తనను ములుగు ఎమ్మెల్యేగా గెలిపిస్తే సాకులు చెప్పనని పని చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. పదేళ్ల క్రింద ములుగు నియోజక వర్గం రోడ్లు అభివృద్ధి లేక అద్వానంగా ఉండేదని ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ములుగు నియోజకవర్గ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని అన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే లేరని, ఢిల్లీలో ఉన్న నాయకుల మెడల్వంచి రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో సీఎం కేసీఆర్ చూపించారని అన్నారు. ములుగును జిల్లాగా మల్లంపల్లిని మండలం గా ములుగు కు మెడికల్ కళాశాల ఎటునాగారం రెవెన్యూ డివిజన్ గా మంగపేటకు నూతన బస్టాండ్ ఎటునాగారంకు అగ్నిమాపక కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి ఏంటో చూపించిన సీఎం కేసీఆర్ కు మనందరం రుణపడి ఉండాలని అన్నారు. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. మన జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే బి ఆర్ ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనేక ప్రైవేట్ కంపెనీ మన రాష్ట్రానికి తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన అనంతరం ములుగుకు సైతం ఐటి కంపెనీ తీస్తే ఎందుకు కృషి చేస్తానని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసునని తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లంపల్లి మండలం ఏర్పాటు అయితే టిఆర్ఎస్ పార్టీని బాజీ భారీ మెజారిటీతో గెలిపిస్తానన్న మండల సాధన జేఏసీ నాయకులు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. నిండు మనసుతో ప్రతి ఒక్కరు ఆలోచించి తమ ఇంట్లో ఆడబిడ్డగా ఆదరించి తనను గెలిపించాలని కోరారు.
- జగదీష్ ఆశాయాల సాధనకు కృషి చేస్తా : జగదీష్ సతీమణి రమాదేవి.
జడ్పీ చైర్మన్గా ఉన్న సమయంలో కుసుమ జగదీష్ కు ఈ ప్రాంతం ప్రతి సమస్యలో అండగా నిలిచిందని ఈ సందర్భంగా ఆయన సతీమణి కుసుమ రమాదేవి అన్నారు మల్లంపల్లి మండలం కావాలనే జగదీష్ ఆశయమని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు మల్లంపల్లి మండలం గా ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీకి మనమందరం రుణపడి ఉండాలని ఈ సందర్భంగా రమాదేవి అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని ఈ ప్రాంతం నుంచి అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతగా తెలపాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మల్లంపల్లి సర్పంచ్ చంద కుమారస్వామి ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చిదర సంతోష్ యువజన నాయకులు , మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.