ముదిరాజ్ కుల సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా..
- ముదిరాజ్ కులాన్ని మోసం చేసిన బి.ఆర్.ఎస్.పార్టీకి తగిన బుద్ది చెప్పాలి...
- ముదిరాజ్ నాయకుల్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క.
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి నవంబర్ 22: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముదిరాజ్ కుల సంఘం ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరించకే అందుకు కృషి చేస్తానని ములుగు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అన్నారు.ములుగు మండ లం ఇంచేర్ల ఎమ్.ఆర్.ఫంక్షన్ హాల్ లో బుధవారం జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్, నియోజక కన్వీనర్ చిటమట రఘు, మత్స్య సహకార సంఘ అధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, సాధు శంకర్, అలువాల ఐలయ్య, ఏల శ్రీకాంత్, దండే బోయిన రఘు, గంగుల సాంబయ్య, వెంకటాపూర్ మండల అధ్యక్షులు రెడ్డి నర్సయ్య, ఆధ్వర్యంలో ములుగు జిల్లా ముదిరాజ్ కుల సంఘ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ ఆత్మీయ సమ్మేళనంకు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మేల్యే అభ్యర్థి దనసరి సీతక్క హజరయ్యరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముదిరాజ్ కుల సంఘ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన ముదిరాజ్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ముదిరాజు కులస్తులను పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముదిరాజ్ కుల సంఘం ప్రధాన సమస్య లు జిల్లా కేంద్రములో ముదిరాజ్ కుల సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం,ములుగు జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాళ్లు, కుల ఆరాధ్య దైవం అయిన పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం, ఉన్న ఆలయాల కు ప్రత్యేక గ్రాంట్లు ఇప్పించి మరమ్మత్తు లు ముదిరాజ్ కులాన్ని బీసీ(డి) బీసీ(ఏ)కు మార్చడం కోసం అసెంబ్లీలో తన గళం వినిపిం చి కృషి చేస్తానని ఏజెన్సీ మండలా లలో ముదిరాజ్ కులానికి కూడా మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ముదిరాజ్ కుల సంఘం గౌరవ అధ్యక్షుడు వేంకట మల్లయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.