మిర్చినారుకు, నాటిన మొక్కలకు దొంగలు బాబోయ్ దొంగలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : చోరకళలో ఆరితేరిన వారిని మనం చూశాం. అయితే అన్నదాతల అవసరం కోసం కొంతమంది చొరకళ నిపుణులు, దొంగలు , మిర్చి నారు కోసం రాత్రికి రాత్రి, మిర్చి తోటల్లో గుబురుగా పెరిగిన మొక్కలను పీకి వేసి అవసరమైన రైతులకు అమ్ముకుంటున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం కోరకల్లు ప్రాంతంలో వ్యవసాయ ఆయకట్టు ప్రాంతంలో చోటు చేసుకోవడంతో, పలువురు రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాజేడు మండలం లో వేలాది ఎకరాల్లో మిరప తోటలు వేసిన రైతులకు, ఎండ వేడిమి,మల్చింగ్ షీట్ వేడి తో చనిపోయిన మొక్కల స్థానంలో మరల మొక్కలు నాటేందుకు, మిర్చి నారు కు భారి కొరత ఏర్పడింది. ఈ కారణంగా కొంతమంది దొంగలు ఇదే అదునుగా చూసుకొని మొక్కను రూపాఇ నుండి రెండు రూపాయల వరకు, వేసిన తోటల్లో పీకి రైతులకు విక్రయిస్తున్నారు. తోటి సోదర రైతులను నష్టపరిచి, తాను లబ్ధి పొందే విధంగా అక్రమ పద్ధతులు కు పాల్పడే వారి పట్ల ,సోదర రైతాంగం ఇదంతా తప్పని తోటలు పీకి నారు అమ్ముకునే దొంగలను పోలీసులకు పట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మిర్చి రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నది. వివరాల్లోకెళ్తే...... ప్రపంచంలో చాలా రకాల దొంగలు ఉంటారు. కొందరు దొంగలు విచిత్ర దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు బద్దకస్తులైన దొంగలు కూడా ఉంటారు. ఇలా దోపిడీ ఘటనలు కోకొల్లుగా చూసుంటాం. తాజాగా మరో వింత దొంగతనం వార్త వాజేడు మండల కేంద్రంలో హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ దొంగతనం అయ్యవారిపేట జి.పి. గ్రామం కోరకల్ సరిహద్దులో చోటు చేసుకుంది. అయితే ఈ దొంగలు చాలా తెలివిగా చేశారు.బోల్లే సాంబ శివరావు (అలియాస్ వెంకట నరసయ్య) అనే రైతు సోదరుడుకుచెందిన మిర్చి చేనులో కొందరు దుండగులు, మిరప చేన్లోకి ప్రవేశించి చేన్లో నాటిన మిర్చి నారును రాత్రికి, రాత్రే దాదాపు 4,000 వేల మొక్కను పీకి వేసి పట్టు కెళ్ళారు. కష్టపడకుండానే భారీగా సంపాదించాలనే పేరాశతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.మిర్చి నారు కోసం దొగతనలు జరిపే దుండగులపై చర్యలు తీసుకోవాలని రైతులు,పోలీస్ శాఖను కోరుతున్నారు. అలాగే దొంగనారు కొనుగోలు చేసి, మిర్చి తోటల్లో పీకి పట్టుకొచ్చి అమ్ముకునే దొంగల సమాచారం ఇవ్వకుండా, ఆనారు ను తమ తోటలలో నాటే రైతులకు ఆయకట్టు రైతాంగం కట్టుబాట్లు, గ్రామ కట్టుబాట్లు ప్రకారం భారీగా జరిమానాలు విధించి, వారిని పోలీస్ శాఖకు అప్పగించాలని, గ్రామీణ మిర్చి రైతాంగం, అన్నదాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.