బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం..
- జనసేన జిల్లా ఇన్చార్జి కొలిపాక ప్రశాంత్
ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గ అభివృద్ధి జరిగింది అంటే అందుకు కారణం మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ అని, ఆయన కుమారుడు బిజెపి అభ్యర్థి డాక్టర్ ప్రహ్లాద్ ను గెలిపించు కోవాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జి కొలిపాక ప్రశాంత్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగులో డాక్టర్ ప్రహ్లాద్ ను కలిసి ఆయనను శాలువాతో సన్మానించిన ప్రశాంత్ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి సంక్షేమ నిర్ణయాలు దేశ పురోభివృద్ధికి పాటుపడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతు తెలపడంతోపాటు జనసేన కార్యకర్తలు ఆయన గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిజెపితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నరసింహులు, శ్రీనివాస్, కళ్యాణ్, తరుణ్, సందీప్, రమేష్, అరుణ్, సురేష్, సాయి, పవన్, సంతోష్, అరవింద్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.