బిజెపి అభ్యర్థి కుంజా ధర్మారావు విస్తృత ప్రచారం.
- ఇంటింటి ప్రచారంతో హోరెత్తిన కమలం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిది : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుంజా ధర్మారావు మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో మంగళవారం గిరిజన సంత కావడంతో బిజెపి నాయకులు పార్టీ అభ్యర్థి ధర్మారావు దుకాణదారులను, సంతకు వచ్చిన ప్రజలను కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలతో, ప్రజల ఆదరణ పెరుగుతున్నదని, ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను పేద ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నదని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి కుంజా ధర్మారావు అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు చెందిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండ్రంగి లక్ష్మీ సుకన్యను భద్రాచలం నియోజకవర్గం ఎన్నికల ప్రచారం ఇన్చార్జిగా నియమించ డంతో,అభ్యర్థి ధర్మారావు, లక్ష్మీ సుకన్యలు ప్రచార రథంపై,నేతల తో వెంకటాపురం ప్రధాన వీధులలో,బస్ స్టాండ్ సెంటర్ , మార్కెట్ సెంటర్ లలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని బూత్ స్థాయిలలో బూత్ ఇన్చార్జీలు కమలం గుర్తుపై ప్రతి ఒక్క ఓటరు ను కలుసుకొని ఓటు వేసి గెలిపించాలని ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రఘురాం, నేత ఉప్పల క్రిష్ణమూర్తి, పార్టీ నాయకులు జల్లిగంపల లక్ష్మీపతి, తంగళ్ళపల్లి ప్రసాదు, హేమసుందర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి, అంకాల దుర్గ, బిజెపి నేతలు విజయ్, అశోక్ ఇంకా పలువురు కార్యకర్తలు నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మాస్కులను ధరించి బిజెపి కార్యకర్తలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిజెపి ఎన్నికల ప్రచార కార్యక్రమం వెంకటాపురం మంగళవారం సంతలో హోరెత్తింది.